హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కుతో తెలంగాణ డిప్యూటీ సీఎం,విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం అయ్యారు. శనివారం ఉదయం వీరిద్దరూ కీలక భేటీ అయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నడుమ విద్యుత్‌కు సంబంధించి కీలక ఒప్పందం జరిగినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో ఈ ఒప్పందం గొప్ప ముందడుగు పడింది. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, విద్యుత్ వనరుల విస్తరణకు, తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -2025కు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నాము’ అని డిప్యూటీ సీఎం వెల్లడించారు.