పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… భీమ్లా నాయక్ రిలీజ్ డేట్స్ వచ్చేశాయి.

-

కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఒక్కొక్కటిగా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. తాజాగా భీమ్లా నాయక్ మూవీ టీం పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 25 లేదా ఎప్రిల్ 1న భీమ్లానాయక్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామంటూ.. మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే పరిస్థితులు చక్కబడటంపై ఈ సినిమా ఆధారపడి ఉంటుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈరెండు తేదీల్లోనే ఏదో ఒక తేదీలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

మళయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రిమేక్ గా భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పవన్ కళ్యాన్ తో పాటు రానా కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాన్ కు జోడీగా నిత్యామీనన్ కనబడనుంది. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… మాటల మాంత్రికుడు స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఇప్పటికే థమన్ అందిన మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయింది. ప్రేక్షకులు ఈసినిమా కోసం చాలా ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version