ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్‌..భీమ్లా నాయ‌క్ రిలీజ్ వాయిదా

-

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఎంతో ప్ర‌తి ష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన భిమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు పేర్కొన్నారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ , రాధే శ్యామ్ సినిమాలు మాత్ర‌మే సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్నాయ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్య‌ణ్ న‌టించిన భిమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుంది.

అంద‌రం క‌లిసి.. ప‌వ‌న్ కళ్యాణ్, భీమ్లా నాయ‌క్ సినిమా నిర్మాత‌ల‌ను వాయిదా వేయ‌మ‌ని అడిగాము. దానికి వారు సానుకూలంగా స్పందించారు. సంక్రాంతి బ‌రి నుంచి భీమ్లా నాయ‌క్ త‌ప్పుకుంటుంద‌ని దిల్ రాజ్ చెప్పారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు ది ల్ రాజు.

అటు ‘ఎఫ్ 3’ సినిమా విడుదల వాయిదా కానుంద‌న్నారు దిల్ రాజు. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమా ఏప్రిల్ 29కి మారిందని.. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కు రానుందని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version