సినిమా పరిశ్రమలో పని చేసే వారికి టాలెంట్ తో పాటు, ముందు చూపు, అదృష్టం కూడా వుండాలి. ఎందుకంటే ఒక సినిమా సెట్స్ మీద వుండగానే ఇంకో సినిమా సెట్ చేసుకొని రెడీ గా వుండాలి. లేకుంటే ఇంకో సినిమా చేయటానికి చాలా గ్యాప్ వస్తుంది. ఆ డైరెక్టర్ ఎంత పెద్ద హిట్ ఇచ్చినా వెంటనే మరో అవకాశం తెచ్చుకోవాలి
సినిమా విడుదలై ఏడాది అవుతున్నా మరో హీరో ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే కామెంట్ లు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సాగర్ చంద్రకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ చంద్ర దర్శకత్వం ఒక సినిమా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రమే తరువాయి అని అంటున్నారు.