సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఇవాళ భోగి. మరి.. భోగి స్పెషల్ వంటకం ఏంటో మీకు తెలుసు కదా. స్వీట్ పొంగల్. అవును.. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు స్వీట్ పొంగల్ ను. మరి.. సంక్రాంతి రుచుల్లోని భోగి స్పెషల్ వంటకమైన స్వీట్ పొంగల్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పును మూకుడులో వేసి కాసేపు వేయించండి. ఆ తర్వాత బియ్యాన్ని తీసుకొని.. బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడగండి. కుక్కర్ లో కడిగిన బియ్యం, వేయించి పెట్టుకున్న పెసరపప్పు, కొన్ని పాలు, బియ్యానికి సరిపడా నీళ్లు పోసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఓ నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఇంతలో ఓ పాన్ తీసుకొని నీళ్లు పోసి బెల్లం వేసి పాకం పట్టండి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం పాకాన్ని దాంట్లో వేసి ఇంకొంచెం నెయ్యి వేసి కొంచెం సేపు ఉడికించండి. ఇంతలో మరో పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ను వేయించండి. వాటిని ఉడికిన అన్నంలో వేసి లవంగాలు, యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని కలిపి స్టౌ కట్టేయండి. అంతే.. వేడి వేడి స్వీట్ పొంగల్ రెడీ. కాసింత నెయ్యి వేసుకొని వేడి వేడిగా లాగించేస్తే ఉంటది… అమృతం తిన్నట్టే.