యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ రావు ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశాడు. సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించిన ఆయన నిన్న రాత్రి సంస్థాన్ నారాయణపురంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. ముందుగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
వారికి అందిస్తున్న భోజనం, రోజువారి దినచర్య గురించి ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలు, వంటగది, భోజనం తయారీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేసిన కలెక్టర్.. వారికి తగు సలహాలు, సూచనలు చేశారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయం విధుల కోసం బయలుదేరారు. గతంలోనూ జిల్లా కలెక్టర్లు గిరిజన , గురుకుల పాఠశాలలను తనిఖీ చేయడంతో పాటు నిద్ర చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.