ఆంధ్రప్రదేశ్ పొరుగున ఉండే రాష్ట్రమైన కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున కర్ణాటకలోని కోలారు జిల్లా రాయల్ పాడు గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై నుంచి కిందకు పడిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉కర్ణాటకలోని కోలారు జిల్లా రాయల్పాడు గ్రామ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి, పలువురికి గాయాలు.
👉బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు బస్సు వస్తుండగా ప్రమాదం.
For More Updates Download The App Now-https://t.co/iPdcphBI9M pic.twitter.com/FeK56cZglA
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2024