టాలీవుడ్ కింగ్‌కు ‘బిగ్’ బాస్ షాక్..నాగార్జున స్థానంలో సమంత?

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే.ఈ క్రమంలోనే తర్వాత సీజన్ కు సంబంధించిన ప్రకటన ఇటీవల వచ్చింది. ఈ సారి సామాన్యులు కూడా ‘బిగ్ బాస్’లో పార్టిసిపేట్ చేయొచ్చని నాగార్జున ప్రకటించారు. కాగా, తాజాగా ‘బిగ్ బాస్ ’ నిర్వాహకులు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ను ఈ సీజన్ కు వద్దు అని చెప్పినట్లు టాక్. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో సమంతను హోస్ట్ గా పెట్టాలని భావిస్తున్నారట. ఈ విషయమై సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

త్వరలో హోస్ట్ గురించి ‘బిగ్ బాస్ ’నిర్వాహకులు అధికారికంగా ప్రకటన చేయనున్నారని సమాచారం. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా బిందు మాధవి గెలిచిన సంగతి అందరికీ తెలసిందే. కాగా, నాగార్జున ను పక్కనబెట్టి సమంతను హోస్ట్ గా తీసుకురావడానికి గల కారణాలేంటనేది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తర్వాతే హోస్ట్ గా ఉండబోయేది ఎవరనేది స్పష్టం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version