దేశంలో మత పిచ్చి తప్పా వేరే చర్చ లేదని కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్. దేశం ప్రమాదకర స్థితిలో ఉందని అన్నారు. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిల్లాడుతోందని విమర్శించారు. విచ్ఛిన్నకర శక్తులు ఇలాగే పెట్రేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. అశాంతి పెరిగితే అంతర్జాతీయ పెట్టుబడులు రావని.. ఉన్న పెట్టుబడులు తిరిగి వెళ్లిపోతాయని అన్నారు. దేశం కోలుకోలుకోవడానికి మరో వందేళ్లు పట్టినా.. ఆశ్చర్య పోనక్కర లేదని విమర్శించారు. దేశం ప్రగతిపథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, ఆర్థిక, పారిశ్రామిక విధానాలను తీసుకురావాలని సూచించారు.
దేశంలో మతపిచ్చి తప్పా వేరే చర్చ లేదు.. కేంద్రంపై కేసీఆర్ విమర్శలు
-