అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న సమయంలో అమెరికా మద్దతు పూర్తిగా ఉంటుందని, మొదటి వేవ్ తో అమెరికా సతమతం అయినపుడు భారత్ సహకరించిందని, అలాగే ఇప్పుడు తమ సహకారం ఉంటుందని తెలిపాడు. నిన్న రాత్రి దాదాపు 45నిమిషాల పాటు సంభాషణ కొనసాగిందని తెలుస్తుంది. ఆల్రెడీ వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన వస్తువులను భారత్ కి పంపేందుకు అమెరికా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.
అలాగే ఆక్సిజన్, ఇంకా ఇతర కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని బైడెన్ మాటిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్, గతంలో భారత్ మాకు సహకరించింది. ఇప్పుడు మా సహకారం వారికి ఉంటుంది అని అన్నాడు. ఈ మాటలకి సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ, కఠిన సమయాల్లో అమెరికా సాయం అందిస్తున్నందుకు దన్యవాదాలు తెలిపాడు.