Acharya: రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి..‘ఆచార్య’ ఫంక్షన్‌లో అనౌన్స్‌మెంట్?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శనివారం హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక అయింది. కాగా, ఈ వేదికపైనే బిగ్ అనౌన్స్ మెంట్ రాబోతున్నదని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రాబోతున్నారని టాక్.


ఈ క్రమంలోనే రాజమౌళి చిరంజీవితో సినిమా చేస్తానని ప్రకటిస్తారని టాక్ వస్తోంది. ఇక ఈ అనౌన్స్ మెంట్ రాజమౌళి కంటే ముందే చిరంజీవి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. RRR ఫిల్మ్ తో రాజమౌళి తన సత్తా ఏంటో ప్రపంచానికి మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో పని చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. అందుకే ఈ విషయమై తానే మాట్లాడి ఒప్పించినట్లు వినికిడి.

రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ మహేశ్ బాబుతో చేయనున్నారు. ఇది పూర్తి అయిన తర్వాత చిరంజీవితో రాజమౌళి సినిమా చేస్తారని అంటున్నారు. రాజమౌళి కోసం చిరంజీవి సంవత్సరం లేదా రెండేళ్లు అయినా డేట్స్ ఇవ్వడానికి ఓకే చెప్పేశారని టాక్. చూడాలి మరి.. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ అనౌన్స్ మెంట్ వస్తుందో లేదో..

Read more RELATED
Recommended to you

Exit mobile version