బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ హార్ట్ టచింగ్ మాటలు.!

-

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్‌ సొంతంగా  కష్ట పడి పైకి వచ్చిన నటుడు. ఇక అంతకు సీరియల్స్ తో కొంత ఫేమ్ సంపాదించిన సోహైల్‌ , ఇక బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన తర్వాత తన ఆట తీరుకు మాట తీరుకు అబిమానులు ఫిదా అయిపోయారు.ఇక ఫైనల్ లో విజేత గా నిలిచిన వారికంటే తనకే ఎక్కువ క్రేజ్ వచ్చింది. తనకు హీరో అయ్యే ఫేమ్ ఉందని చాలా మంది గుర్తించారు.

ప్రస్తుతం తాను హీరో గానటిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. మోక్ష హీరోయిన్ గా నటిస్తోంది.దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డైరెక్టర్ ఎ.ఆర్‌.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ ను నిర్మిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా  ఈ డిసెంబర్ 30న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా శనివారం చిత్ర యూనిట్ టీజర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ ”ఈరోజు నేను హీరోగా చేసిన లక్కీ లక్ష్మణ్ టీజర్‌కు ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తూంటే చాలా ఆనందం కలుగుతోంది.అభిమానులే నాకు ధైర్యం. మనల్ని ఇష్టపడే ఫ్యాన్స్‌మనల్ని గుండెల్లో పెట్టుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో ఫ్యాన్స్ వచ్చారు. ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. వారికి ఏమిచ్చినా మనం ఋణం తీర్చుకోలేను. సక్సెస్ ఉన్నా, లేకపోయినా మనల్ని ఆదరించేది మనం ఇష్టపడేవాళ్లు, ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌. అలాంటి వాళ్లు నాకు అండగా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version