బుల్లితెర నటి సరయు పలు సిరీయల్స్, వెబ్సిరస్లు, సినిమాల్లో నటించింది. బిగ్బాస్-5 సీజన్లో పాల్గొని వారం రోజులకే ఎలిమినేట్ అయింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సరయు రియాలిటీ షోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్. కొనుక్కుని, లేదంటే తిరిగి వాళ్లకే డబ్బులిచ్చి మన అనుకునేవాళ్లను ప్రమోట్ చేసి ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ఫామ్సే ఈ రియాలిటీ షోలు. మిమ్మల్ని, మనల్ని.. జనాలందరినీ పిచ్చోళ్లను చేస్తున్నారు అని తెలిపింది.
వాటివల్ల పిచ్చోళ్ళయ్యేది మనమే. కాబట్టి ఇలాంటి షోలను చూడకండి. నేను బిగ్బాస్ కి వెళ్లాను తెలుసుకున్నాను కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు సరయు. యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్ తో ఫెమస్ ఐన సరయు.. బిగ్ బాస్ సీజన్ 5తో పాటు, ఓటీటీలో వచ్చిన నాన్ స్టాప్ లో కూడా పాల్గొంన్న విషయం తెలిసిందే. ఈ రెండు సీజన్స్ లోను మధ్యలోనే బయటకు వచ్చేసింది ఈ బ్యూటీ.