Big Boss Non Stop: అఖిల్‌పై అషురెడ్డి జోకులు..అరియానాపై బాబా మాస్టర్ పంచులు..

-

‘బిగ్ బాస్’ షో ఎనిమిదో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య పోటీ రోజురోజుకూ ఇంకా పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే టైటిల్ విన్ ఎవరు అవుతారనేది చెప్పడం కష్టంగా మారనుంది. రోజురోజుకూ సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. 53వ రోజు అనగా శుక్రవారానికి సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. సదరు ప్రోమో నెట్టింట వైరలవుతోంది.

అషురెడ్డి-అఖిల్ మధ్య ఏం జరుగుతుందనేది ప్రోమోలో చూపించారు. ఓ వైపు అఖిల్ పైన అషురెడ్డి పిచ్చి పిచ్చి జోకులు వేస్తున్నది. అతను ‘‘అఖిల్ కాదు పికిల్’’ అని కామెంట్ చేసింది. మరో వైపున తనకు, అషురెడ్డికి ఎటువంటి బాండ్ కాని ఎమోషనల్ బాండ్ కాని లేదని అఖిల్ చెప్తున్నాడు. ఇంతలోనే అరియానాపైన బాబా మాస్టర్ పంచ్ అదిరిపోయింది.

శారీలో ఎలా ఉన్నాను? అని అడగగా, శారీ బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చినట్లే ఇచ్చి సెటైర్ వేశాడు. ఇక ‘బిగ్ బాస్’ ఈ క్రమంలోనే యాక్టివిటీస్ ఇచ్చేశారు. ఇంటి సభ్యులు..‘స్టాబ్ ఆర్ సేవ్..’ యాక్టివిటీ చేయాలని చెప్పాడు. అనగా.. కట్టప్ప ఎవరు? బాహుబలి ఎవరు? అనేది చెప్పాల్సి ఉంటుంది.

కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమకు కట్టప్ప ఎవరు, బాహుబలి ఎవరు అనేది చెప్తున్నారు. అయితే, అఖిల్ మాత్రం తాను ఎవరికి ఈ యాక్టివిటీ స్టాంప్ ఇవ్వాలనుకోవడం లేదని చెప్పాడు. బిందు మాధవి, ఇతర కంటెస్టెంట్స్ స్టా్బ్ ఆర్ సేవ్ గేమ్ లో ఏ విధంగా పర్ఫార్మ్ చేశారో తెలియాలంటే శుక్రవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version