Big Boss Non Stop: నటరాజ్, బాబా భాస్కర్ మధ్య మాటల యుద్ధం..హౌజ్‌లోకి సిరి హన్మంత్ సడెన్ ఎంట్రీ..

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ ‘‘ఓటీటీ’’ రసవత్తరంగా సాగుతోంది. పదో వారంలోకి ఎంటర్ అయింది గేమ్. ఇక కంటెస్టెంట్స్ అందరూ టైటిల్ విన్నింగ్ పైన ఫోకస్ చేస్తున్నారు. తాజాగా ‘బిగ్ బాస్’ నిర్వాహకులు మంగళవారానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 65వ రోజు నాటి ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఈ ప్రోమోలో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ‘‘కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్’’ అనే రామ్ పోతినేని ‘‘ది వారియర్’’ చిత్రంలోని ‘బుల్లెట్’ పాటకు కంటెస్టెంట్స్ డ్యాన్స్ చేశారు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించగా, ఈ పాటను కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఆలపించారు.

ఇక హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సిరి హన్మంత్..తాను, షణ్ముక్ జస్వంత్ ఏ బెడ్ పైన కూర్చొని ఉన్నారో కంటెస్టెంట్స్ కు తెలిపింది. అంతలోనే బాబా భాస్కర్ మాస్టర్ సిరి హన్మంత్ వద్దకు వచ్చి…‘అరెయ్ ఏంట్రా ఇది’ అని అన్నాడు. అలా హౌజ్ లో నవ్వులు పూశాయి.

ఈ క్రమంలోనే బాబా భాస్కర్ మాస్టర్ కుక్ గా మారి ఏదో వండుతున్నాడు. అంతలోనే అక్కడికి నటరాజ్ మస్టర్ వచ్చి ఏం చేస్తున్నారని అడిగాడు. అప్పుడు ‘మటన్’ అని బాబా చెప్పడంతో పాటు నటరాజ్ కు వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పాడు. దాంతో నటరాజ్ మాస్టర్ బాబాపై ఫైర్ అయ్యాడు. ‘‘ముసలోడికి కాలు ఇరిగిపోయింది.. పొద్దునే లెగిచి..’’ ఏం చేస్తాడని అన్నాడు.

అప్పుడు బాబా మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కత్తితో అక్కడే ఉన్న డబ్బాను పొడిచాడు. రాగాలు బోగాలు తనతో పెట్టుకోకూడదని అన్నాడు. అప్పుడు ఓవర్ చేస్తున్నావని నటరాజ్ అన్నాడు. దాంతో ‘‘అవును రా..ఓవర్ అంటే ఓవర్ రా’’ అని బాబా భాస్కర్ మాస్టర్ అరిచేశాడు. అంతటితో ప్రోమో ముగిసింది. తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే మంగళవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version