బిగ్ బాస్ హోస్ట్ కోసం జూ ఎన్టీఆర్ కు ఎంతైనా ఇచ్చేందుకు సిద్దం..!!

-

అక్కినేని నాగార్జున  బిగ్ బాస్ షో ను వదిలి పెడుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాను నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని కోరుతున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత నాగ్ కు మంచి హిట్ రాలేదు. ఎంతగా కష్టపడుతున్నా గాని   సక్సెస్ అందుకోలేక పోతున్నారు.’ది ఘోస్ట్’ సినిమాను కూడా కష్టపడి మంచి యాక్షన్ సినిమాగా తీశారు. కాని ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

దీంతో నాగార్జున అలోచనలో పడ్డారట.  దానితో పాటు బిగ్ బాస్ షో రేటింగ్స్ కూడా ఇయర్ ఇయర్ కు తగ్గిపోతున్నాయి. దానితో  నాగార్జున బిగ్ బాస్ సీజన్ 7 కు హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఆయన బిగ్ బాస్ వల్ల సినిమాలకు అన్యాయం చేస్తున్నాను అనే ఫీలింగ్ లో ఉన్నాడట. దీంతో వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో టీమ్ వారు ముందుగా యంగ్ హీరోస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరియు జూ ఎన్టీఆర్ లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూ ఎన్టీఆర్ మొదటి సీజన్లో అదరగొట్టి న కారణంగా, పడిపోయిన రేటింగ్ ను మళ్లీ రికవరీ చేసే సత్తా ఉందని నమ్ముతున్నారు. అందుకే జూ ఎన్టీఆర్ కు ఎంత అమౌంట్ అయినా ఇచ్చి లాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని టాక్ నడుస్తోంది

 

Read more RELATED
Recommended to you

Exit mobile version