Big Breaking : కూకట్ పల్లిలో కూలిన అంతస్తు…. శిథిలాల కింద కార్మికులు

-

హైదరాబాదులోని కూకట్ పల్లి లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా బయటకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మూడవ అంతస్తులు స్లాబ్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే స్లాబ్ కింద ఎవరైనా ఉన్నారేమోనని అనుమానిస్తున్నారు స్థానికులు. విషయం తెలుసుకున్న మునిసిపల్ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version