ముంబై లోని వాంఖడే మైదానంలో జరుగుతున్న మొదటి సెమి ఫైనల్ లో భాగంగా ఇండియా మరియు న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ ఆలోచన చేయకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగిన విధంగానే ఇండియా కు పరుగుల వర్షం కురిపించాడు రోహిత్ శర్మ. రోహిత్ ఎదుర్కొన్న 29 బంతుల్లోనే నాలుగు డోర్లు మరియు నాలుగు సిక్సులతో పరుగులు చేసి సౌథీ వేసిన ఒక ఇన్ స్వింగింగ్ బంతిని సరిగా అంచనా వేయలేక గాల్లోకి బంతిని ఆడి విలియమ్సన్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. రోహిత్ అవుట్ అవడంతో ఒక్కసారిగా స్టైఅదియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఉన్నంతసేపు కివీస్ బౌర్లలను ఉతికి ఆరేసిన రోహిత్ అనుకోకుండా అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గిల్ మరియు కోహ్లీ లు ఉన్నారు.
ఈ మ్యాచ్ లో అయినా రోహిత్ సెంచరీ చేస్తాడని కలలు కన్న అభిమానులకు షాక్ తగిలింది. ఇక ఇండియా ఈ మ్యాచ్ లో ఎంత స్కోర్ చేస్తుందన్నది చూడాలి.