కొత్త సమస్యల దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు !

-

కరోనా వైరస్ అరికట్టాలంటే కచ్చితంగా సమాజంలో సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని కేంద్రం ఆదేశించడం జరిగింది. అయితే ఎన్ని చెబుతున్నా గాని ప్రజలలో మాత్రం కొంచెం కూడా మార్పు రావడం లేదు. ఇటలీ దేశ ప్రజల మాదిరిగా భారతీయులు కూడా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మధ్య కరోనా వైరస్ విషయంలో సరికొత్త దిశగా సమస్య ఏర్పడింది. మేటర్ లోకి వెళ్తే నిత్యావసర సరుకుల నిమిత్తం తెచ్చుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టైం ఇవ్వడం జరిగింది.ఈ నేపథ్యంలో ఇంటికి ఒక్కడు వెళ్లాలని బయట సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసినా..రెండు తెలుగు రాష్ట్రాలలో జనాలు కూరగాయల కోసం గుంపులు గుంపులుగా పోగవుతున్నారు. ఈ విధంగానే కొనసాగితే ఇక లాక్ డౌన్ చేసినా ఉపయోగం ఉండదని దాన్ని స్ఫూర్తి అట్టర్ ఫ్లాప్ అవుతుందని..ఈ విధంగా బయటకు వచ్చిన వ్యక్తి ఇంటి సభ్యులకు ప్రమాదకరంగా మారుతాడని అంటున్నారు.

 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ విధమైన పరిస్థితి నెలకొంటుందని పేర్కొంటున్నారు. అయితే ఇక్కడ సమస్యను అర్థం చేసుకుని..రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు…ఒక్కసారిగా పట్టణంలో ఉన్న ప్రజలను పంపించకుండా, పట్టణాన్ని కొన్ని విభాగాలుగా విభజించి సదరు ఏరియాలో ఉన్న వారిని మాత్రమే బయటికి పంపించి మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళని ఇంటికి పరిమితం చేస్తే గుంపులు గుంపులు సమస్య ఉండదని చాలా మంది అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే చాలా వరకు సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని లాక్ డౌన్ స్ఫూర్తి నింపిన వాళ్లమవుతాం అని పేర్కొంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version