గూగుల్ పే వినియోగదారులకు బిగ్ షాక్.. ఇకపై అక్కడ సేవలు బంద్

-

గూగుల్ పే వాడే వినియోగదారులకు బిగ్ షాక్. జూన్ 4 నుంచి గూగుల్‌పేను పలుదేశాలలో మూసి వేయబోతున్నట్లు ఆ సంస్థనే స్వయంగా పేర్కొంది.గూగుల్ పే ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో సేవలు కొనసాగిస్తోంది. జూన్ 4 తర్వాత గూగుల్ పే యాప్ ఇండియా, సింగపూర్‌లో మాత్రమే తమ సేవను అందించబోతున్నట్లు పేర్కొంది. అమెరికాలో దీని సేవలు నిలిపివేయబోతున్నట్లు ,కంపెనీ ప్రకారం వినియోగదారులందూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని వెల్లడించింది.

గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని భావిస్తున్నారు. దాదాపు 180 దేశాల్లో గూగుల్ పేని గూగుల్ వ్యాలెట్ భర్తీ చేసిందని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. కాగా.. గూగుల్ పే, గూగుల్ వాలెంట్ ఈ రెండూ భిన్నమైన యాప్స్. అలాగే ఇవి అందించే సర్వీసుల్లోనూ తేడాలు ఉన్నాయి. గూగుల్ వాలెట్లో టికెట్స్, రివార్డ్స్ ఇతర కీలను ఇందులో సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ పే లో చేసినట్టుగా ఆన్‌లైన్ లావాదేవీలను ఇక్కడ నిర్వహించడం సాధ్యం కాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version