ర‌ష్యాకు బిగ్ షాక్.. ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌కప్ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌

-

ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. యుద్ధం వద్ద‌ని ప‌లు దేశాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ర‌ష్యా కోరినా.. వాటిని బేఖాత‌రు చేస్తు ఉక్రెయిన్ పై యుద్ధం ప్ర‌క‌టించింది. దీంతో ఇప్ప‌టికే చాలా దేశాలు ర‌ష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. తాజా గా ఫిఫా, యూఈఎఫ్ఏ కూడా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాయి. ర‌ష్యా వ్య‌వ‌హ‌రం పై ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్తం గా స‌మావేశం నిర్వహించాయి. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నాయి.

ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే.. ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ తో పాటు అన్ని అంత‌ర్జాతీయ పోటీలు, ఇత‌ర లీగ్ మ్యాచ్ ల నుంచి ర‌ష్యా ను బ‌హిష్క‌రించాయి. త‌మ నిర్ణ‌యం త‌దుప‌రి నోటీసులు ఇచ్చేంత వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని ఫిఫా, యూఈఎఫ్ఏ ప్ర‌క‌టించాయి. కాగ ఈ ఏడాది చివ‌ర్లో ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ జ‌ర‌గ‌బోతుంది. అందు కోసం క్వాలిఫైయింగ్ ప్లే ఆఫ్ సెమీ ఫైన‌ల్ లో మార్చి 24న పోలాండ్ తో ర‌ష్యా త‌ల ప‌డ‌నుంది.

దీని త‌ర్వాత స్వీడ‌న్ లేదా చెక్ రిప‌బ్లిక్ తో పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. అయితే ఈ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల‌లో ఈ మూడు దేశాలు ర‌ష్యాతో ఆడ‌టానికి నిరాక‌రించాయి. అంతే కాకుండా ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ నుంచి ర‌ష్యా ను బ‌హిష్క‌రించాల‌ని డిమాండ్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version