వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాలల్లో హాల్ చల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ గోరంట్ల మాధవ్ వీడియో ఎపిసోడ్లో అమెరికా ల్యాబ్ నివేదిక అని టీడీపీ విడుదల చేసిన రిపోర్ట్‌లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎక్లిప్స్ నివేదికలో మార్పులు చేసి మీడియాకు టీడీపీ విడుదల చేయగా… టీడీపీ విడుదల చేసిన నివేదిక ఒరిజనల్ కాదని స్పష్టం చేసింది ఎక్లిప్స్ ల్యాబ్.
వీడియో, టీడీపీ విడుదల చేసిన నివేదిక అంశాల పై వివరణ కోరుతూ ల్యాబ్‌కు వైసీపీకి సంబంధించిన వారు మెయిల్ చేయగా… ఆ మెయిల్‌కు సమాధానం ఇచ్చింది అమెరికాలోని ఎక్లిప్స్ ల్యాబ్. గోరంట్ల న్యూడ్ వీడియో క్లిప్‌ను ఎక్లిప్స్ ల్యాబ్‌కు పంపించామని పేర్కొంది టీడీపీ. ఆ వీడియో ఎడిటెడ్ కాదని ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్న టీడీపీ.. వేరే ఫోన్లో ప్లే అవుతుండగా రికార్డు చేసిన వీడియోనే మాకు పంపించారని ఎక్లిప్స్ ల్యాబ్ తేల్చి చెప్పింది. టీడీపీ విడుదల చేసిన నివేదిక ఒరిజనల్ కాదని ఎట్టకేలకు ఎక్లిప్స్ ల్యాబ్ స్పష్టం చేసింది.