బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారికి బిగ్ ‌షాక్.. రంగంలోకి సీఐడీ

-

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి తెరలేపిన బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయాలని సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో బెట్టింగ్ యాప్స్ కింద నమోదయ్యే కేసులను ఇకమీదట సీఐడీ మాత్రమే విచారణ జరపనుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులు అన్నింటినీ సీఐడీకి అప్పగించనుంది.

సీఐడీ మాత్రమే ఈ కేసులను లోతుగా దర్యాప్తు చేయగలరని భావించిన రాష్ట్ర సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా కూడా చూడాలని సీఐడీకి దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.హైదరాబాదులో 11 మంది బెట్టింగ్ యాప్స్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి.సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news