ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు బిగ్ షాక్ తగిలింది. కేరళ రాష్ట్రంలోని ఓ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. పతంజలి ఉత్పత్తుల ప్రకటనలతో రాందేవ్ బాబా, ఆ సంస్థ వ్యవస్తాపకుడు ఆచార్య బాలకృష్ణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేరళ డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు.
ఈ కేసు విచారణకు రావాలని పలుమార్లు కోర్టు నోటీసులు పంపించినా వారు హాజరుకాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే కోర్టు ధిక్కరణ చర్యల కింద రాందేవ్ బాబాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, దీనిపై పతంజలి సంస్థ సీఈవో, రాందేవ్ బాబా ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.