టీడీపీకి బిగ్ షాక్; మండలి రద్దుకి పార్లమెంట్ ఆమోదం…!

-

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు నెలల నుంచి కూడా మండలి రద్దు వ్యవహారం ఆసక్తిని రేపుతూనే ఉంది. మండలి రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనిని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదిస్తారని భావించారు. తొలి విడత సమావేశాల షెడ్యుల్ లో దీనిని పెడతారని వైసీపీ భావించింది. కాని అనూహ్యంగా షెడ్యుల్ లో ఆ బిల్లుని కేంద్రం పెట్టలేదు.

ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మండలి రద్దు అంశాన్ని వారి వద్ద ప్రస్తావించగా అమిత్ షా నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తుంది. జగన్ ఢిల్లీ నుంచి రాగానే వైసీపీ నేతలు అదే విధంగా ప్రకటన చేసారు. మండలి రద్దుకి హోం శాఖ ఆమోదించింది అంటూ వైసీపీ నేతలు మీడియా ముందు చెప్పారు.

ప్రస్తుతం రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుని కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉభయ సభల్లో దీన్ని ఏప్రిల్ మూడో తేదీ లోపు ఏదోక సందర్భంలో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎన్డియే లో వైసీపీ చేరినా సరే కేంద్రం వెంటనే ఆమోదించే అవకాశం ఉంది. ఎన్డియే లో వైసీపీ చేరితో రాష్ట్రంలో జగన్ ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి.

అందుకే ఇప్పుడు వైసీపీ కూడా ఒకటికి పది సార్లు ఈ విషయంలో ఆలోచిస్తుంది. రాజకీయంగా బలంగా ఉన్న అధికార పార్టీ ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది. మండలి రద్దు గనుక కేంద్రం చేస్తే రెండు రాజ్యసభ సీట్లను ఎన్డియే కు ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించారని సమాచారం. ఈ నెల 26 న రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version