ఇక నుంచి మెట్రోలో హైదరాబాద్ భాష…!

-

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను క్రమంగా పరిష్కరిస్తున్న మెట్రో సామాన్యులకు క్రమంగా అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యార్ధం ట్రాఫిక్ నుంచి ప్రతీ ఒక్కటి మెట్రో సదుపాయాలను కల్పిస్తూ వస్తుంది. ఇక తాజాగా హైదరాబాద్ మెట్రో కి మరో హంగుని జోడించే ఆలోచనలో ఉన్నారు. హైదరాబాద్ లో వాడుక భాషను మెట్రో లో ప్రవేశ పెట్టేందుకు గాని సిద్దమై౦ది మెట్రో యాజమాన్యం.

హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నగరంలో వున్న అనేక దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణలు, పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన ప్రముఖుల తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను మెట్రో స్టేషన్ పరిసరాలలో చేపట్టాలని సంస్థ మేనేజింగ్ డైరక్టర్, ఎన్.వి.యస్. రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జంట నగరాలలో స్థానిక ప్రజల వాడుక భాషలో అధికంగా వినియోగించే “కైకూ, నక్కో, హౌలే, ఐసాయిచ్, ఖైరియత్?, పోరి, పరేషాన్” వంటి పదాల వినియోగం,

వాటి అర్థాలను సందర్భాలను ఆసక్తి గల వారందరికి తెలియజేసేలా మెట్రో స్టేషన్ గోడలపై రాయించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా యాస లో హైదరాబాద్ యాసకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ మాట్లాడే యాస మనకు ఎక్కడా వినపడదు కూడా. అలవాటు అయిన వాళ్లకు కాస్త సులువుగానే ఉన్నా అలవాటు లేని వాళ్లకు మాత్ర౦ కాస్త కష్టంగా ఉంటుంది హైదరబాద్ యాస.

ఇక హైదరాబాద్ లో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి. చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఉప్పల్ నుంచి పఠాన్ చేరు వరకు చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. గోల్కొండ, హైటెక్ సిటీ, చార్మినార్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్, జు పార్క్, మ్యూజియం ఇలా చెప్తూ పోతే చాలానే ఉన్నాయి. వాటిని పర్యాటకులకు, కొత్తగా హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్లకు అందించాలి అనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయ౦ తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version