ఏపీలో ఎంపీపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని విధంగా కీలక మలుపులు తీసుకుంటున్నాయి. తాజాగా ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఎంపీటీసీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ఉదయం ఓ వీడియో సందేశాన్ని వారు విడుదల చేశారు. తమను ప్రలోభ పెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక అధికార నేతలపై ఎంపీటీసీలు ఆరోపణలు చేశారు. ఐదుగురు ఎంపీటీసీలు ఎన్నిక బహిష్కరించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎంపీపీ ఎన్నిక నిరవధిక వాయిదా పడనుంది.