సంక్రాంతికి #NTR 30 నుంచి బిగ్ అప్డేట్..!

-

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చిత్రీకరిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తోనే సినిమాను సెట్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి అదే తరహాలో సినిమాలు తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ 30వ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారి తన మేకోవర్ మార్చుకోవడంతో.. ఆయన ఎలాంటి లుక్ లో కనిపిస్తాడు? అనే ఆతృత కూడా అందరిలో మొదలయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ అయితే లభించింది కానీ ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తోందనే వార్త వినిపించినా.. ఆమెకు పెళ్లయిపోవడంతో ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలని కొరటాల శివ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్ గా కన్ఫామ్ చేశారని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ అనౌన్స్మెంట్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా పోస్టర్ ద్వారా రివీల్ చేయబోతున్నారు. మరి నిజంగా ఎన్టీఆర్ 30వ చిత్రం నుండి పండుగ ట్రీట్ గా హీరోయిన్ అనౌన్స్మెంట్ రాబోతోందా? నిజంగానే ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశాన్ని జాన్వి కపూర్ కొట్టేసిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version