యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “సలార్”. పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. ఇది ఇలా ఉండగా తాజాగా సలార్ నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం. సలార్ లో మలయాళం నటుడు పృథ్వీ రాజ్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో పృథ్వీ రాజ్ పాత్ర పేరు వరద రాజు మన్నార్. అయితే.. పృథ్వీ రాజ్ నే విలన్ అని చిత్ర బృందం ప్రకటించకపోయినప్పటికీ.. అతని పోస్టర్ ను చూస్తే.. విలన్ అని మనకు అర్థమౌవుతోంది. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది అంటే 2023, సెప్టెంబర్ 28 వ తేదీన రిలీజ్ కానుంది.
Birthday Wishes to the most versatile @PrithviOfficial, Presenting ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ from #Salaar.#Prabhas @prashanth_neel @VKiragandur @hombalefilms @shrutihaasan @IamJagguBhai @bhuvangowda84 @RaviBasrur @anbariv @shivakumarart
#HBDPrithvirajSukumaran pic.twitter.com/tE548jFK2e— Salaar (@SalaarTheSaga) October 16, 2022