BigBoss: ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?

-

బిగ్ బాస్ మొదటి వారంలో నామినేషన్ తీసివేసిన విషయం తెలిసిందే.. కానీ రెండవ వారంలో డబుల్ ఎలిమినేషన్ పేరిట షాని , అభినయశ్రీని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమెనే టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఫ్రీ ప్లాన్డ్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ ఇంట్లోంచి ఎవరు.. ఎప్పుడు.. ఎందుకు.. వెళ్తారు అన్నది సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.. ఇక ఈ మూడో వారంలో బాలాదిత్య, రేవంత్, గీతూ వంటి వారు నామినేషన్ లో ఉన్నా కూడా ఏమంతా డిఫరెన్స్ కనిపించట్లేదు. ఎందుకంటే వీరు టాప్ 5 కంటెస్టెంట్లు కాబట్టి..వీరు ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు.. నామినేట్ అయిన వారిలో ఫైమా, చంటి వంటి వారు ఉన్నప్పటికీ ఇప్పుడే వెళ్లే కంటెస్టెంట్ లు అయితే వీళ్ళు కాదు అని చెప్పవచ్చు.

కానీ ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం వాసంతి, ఆరోహి , ఇనయా అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఇది చాలదన్నట్టు ఈ వారం తానే వెళ్లిపోతాను అని వాసంతి ఒక రేంజిలో ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందరి వద్దే తన బాధను వెళ్ళగకుతోంది. ఇనయా, ఆరోహి, వాసంతి డేంజర్ జోన్లో ఉన్నట్లు వాసంతి కరెక్ట్ గానే గెస్ చేసింది. ఇక బయట కూడా అలాగే ట్రెండ్ సాగుతోంది.. నిజానికి వాసంతి కేవలం మేకప్ వేసుకొని అందంగా రెడీ అవ్వడం తప్ప ఆట ఆడడం లేదు అని కంటెస్టెంట్ లు వాపోతుండగా బయట కూడా ఇదే అనుకుంటున్నారు.. వాసంతికి తన గ్లామర్ కలిసి వస్తోంది. కాబట్టి ఈమెకు ఓట్లు పడే అవకాశం ఉందిఇక ఆరోహి విషయంలో జనాలకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు.

ఇనయ అంతో ఇంతో ఆట ఆడడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ కాస్త టంగ్ స్లిప్ అవుతుంది.. ఒక్కో సారి మాటలు జారుతుంది కానీ ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి అవసరం . ఒకవేళ ఇనయాను పంపిస్తే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం లేదు కానీ చివర్లో లెక్కలు మారడంతో నేహాను ఇంటి నుంచి పంపించేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నేహా ఇంట్లో ఉండి కూడా చేసేదేమీ లేదు కాబట్టి ఆమెను ఎలిమినేట్ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version