బిగ్ బాస్: అఖిల్ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదేమో!

-

బిగ్ బాస్ హౌస్ లో జరిగే సంఘటనలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. మొదటి నుండి ఎంతో స్నేహంగా కనిపించిన వారు కూడా శత్రువులుగా మారడం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. అప్పటి దాకా అవతలి వారిలో కనిపించని లోపాలన్నీ నామినేషన్స్ లో బయటపెట్టడం, అసలెందుకు అరుచుకుంటున్నారో అర్థం కాకపోవడం చూస్తే చాలామంది ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతారు. తాజాగా జరిగిన సంఘటన ఆ రేంజిలో కాకపోయినా హౌస్ లో ఉండే స్నేహాలు ఎలాంటివన్నది మరోసారి నిరూపించింది.

అఖిల్, మోనాల్.. మొదట్నుండి వీరిద్దరూ స్నేహంగా ఉంటున్నారు. టాస్కులు ఆడట్లేదన్న ఉద్దేశ్యంతో నామినేట్ చేయడం మినహాయిస్తే, అఖిల్ ఆమెకి సపోర్ట్ గా నిలబడని అంశాలు చాలా తక్కువ. కానీ ఈ రోజు జరిగిన కెప్టెన్సీ టాస్కులో మోనాల్, హారికని సపోర్ట్ చేసింది. ఆ కారణంగా అఖిల్ కి కెప్టెన్సీ ఛాన్స్ మిస్సయ్యింది. ఈ విషయమై అఖిల్ కోపంగా కనిపించాడు.

కెప్టెన్సీ పోటీదారులని భుజాల మీద ఎక్కించుకుని నిలబడాలి అన్న టాస్కులో హారికని ఎత్తుకుని ఆమె గెలిచేందుకు కారణమైంది. దీంతో అఖిల్ కొంత నిరాశ చెందాడు. మోనాల్ హెల్ప్ చేయకుండా ఉండాల్సింది అన్నది అఖిల్ ఉద్దేశ్యం కావచ్చు. కానీ బిగ్ బాస్ అనేది ఇండివిడ్యువల్ గేమ్. హౌస్ లో ఎంత స్నేహంగా ఉన్నా, చివరికి వారందరూ స్వంత గేమ్ మీదనే ఫోకస్ పెడతారు.

గేమ్ చివరికి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ లభించే కెప్టెన్సీ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఇలాంటి టైములో స్నేహబంధాలు ఎక్కువ కాలం నిలబడవు. ఈ విషయం గత సీజన్లలో చాలా సార్లు నిరూపితమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version