బిగ్ బాస్: మెహబూబ్ అవుట్… వెక్కి వెక్కి ఏడ్చిన సోహైల్.

-

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఒక్కొక్కరిన్ సేవ్ చేసుకుంటూ వస్తూ, చివరికి మెహబూబ్, సోహైల్ మాత్రమే మిగలడంతో ఇద్దరికీ ఒకటే టెన్షన్ పట్టుకుంది. ఎలిమినేట్ అయ్యింది మెహబూబ్ అని ప్రకటించగానే ఒక్కసారి హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకూ ఆడిపాడి చిందులేసిన అందరి కళ్లలో నుండి నీళ్ళు వచ్చాయి. మెహబూబ్ కి ఇంటి నుండి బయటకి వెళ్ళాల్సింది కాదని, ఇంట్లో ఉండే అర్హత అతనికి ఉందని అందరూ అన్నారు.

ఇక సోహైల్ అయితే వెక్కి వెక్కి ఏడ్చాడు. బిగ్ బాస్ సీజన్ 1, సీజన్ 2 చూసినప్పుడూ కంటెస్టెంట్లు ఎందుకు అంతలా ఏడుస్తారని అనుకునే వాళ్లమని, కానీ ఇక్కడకి వచ్చి చూస్తే అర్థం అవుతుందని, హౌస్ లో ఉండే ఎమొషన్సే వేరని, మెహబూబ్ చాలా కష్టపడ్డాడని, వాడిలా నేను ఫిజికల్ టాస్కులు ఆడలేకపోయానని, టాప్ 5లో ఉందామన్నవాడు ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని అనుకోలేదని ఏడుస్తూ అన్నాడు.

అటు పక్క మెహబూబ్ కూడా ఏడుస్తూనే ఉన్నాడు. తాను ఎలిమినేట్ అవుతానని అస్సలు ఊహించలేదు కాబట్టి గుక్కపట్టి ఏడ్చాడు. నాగార్జున గారిని పట్టుకుని ఏడ్చాడంటే, తాను హౌస్ లో ఉంటానన్న నమ్మకం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారాణంగా ఎవరైనా ఎలిమినేట్ అయినపుడు మిగతా హౌస్ మేట్స్ అందరి గురించి ఎంతో కొంత నెగెటివ్ గా చెబుతుంటారు. కానీ మెహబూబ్ మాత్రం అలా చేయలేదు.

అందరినీ మంచిగా ఆడాలనే చెప్పి, అఖిల్ సోహైల్ ని మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉండాలని కోరాడు. మొత్తానికి ఈ నాలుగవ సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నింటిలో మెహబూబ్ ఎలిమినేషనే అత్యంత భావోద్వేగపూరితమైన ఎలిమినేషన్ గా చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version