Bigg Boss 5: “ఏ సమస్య వచ్చినా బ్రహ్మనే సార్ట్ అవుట్ చేస్తాడు.. అత‌డే గేమ్ ఛేంజ‌ర్” ప్రియ సెన్సెష‌న‌ల్ కామెంట్! ఇంత‌కీ ఆ బ్ర‌హ్మ ఎవ‌రు?

-

Bigg Boss 5: ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఏడోవారం హౌజ్‌ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతార‌నే ఉత్కంఠకు తెరపడింది. ఈవారం నామినేషన్స్‌లో లోబో, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్,ప్రియ, యానీ మాస్టర్, సిరిలు నిలువ‌గా ఉండగా.. అనేక ట్విస్టుల మధ్య ప్రియ ఎలిమినేట్‌ అయింది. ఆమెకు తక్కువ ఓట్లు రావడం, టాస్కుల్లో యాక్టివ్‌గా ఉండకపోవడం, కాజల్‌, స‌న్నీల‌తో గొడవ ఇలా అనేక అంశాలు ప్రియకి కార‌ణ‌మ‌ని బిగ్ బాస్ ల‌వర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా స‌న్నీని చెంప పగలకొడతా.. అన‌డం ఆమె కొంప ముంచింద‌నీ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏడో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చి.. ఏడో ఎలిమినేట‌ర్ గా హౌస్ నుంచి వెళ్లిపోయింది. అనంత‌రం స్టేజీ మీద‌కి వ‌చ్చి.. నాగ‌ర్జున‌ను క‌లిసింది. ఈ క్ర‌మంలో కింగ్ నాగ్ ప్రియ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయింది ప్రియ‌. బిగ్ బాస్ హౌస్ చాలా ధైర్య‌మిచ్చింద‌నీ, ఇకపై తాను ఎక్కడ వదిలేసినా ఉండ‌గ‌ల‌ని, అడవిలో ఉన్నా, భాష రాని వారి మధ్య ఉన్నా, వేరే తెగల మధ్య వదిలేసినా కూడా తాను బతికేస్తానని ప్రియ గ‌ర్వంగా చెప్పింది.

వెళ్లే ముందు.. ఇంట్లో స‌భ్యుల‌కు ఎన్ని మార్కులు ఇస్తావ‌నీ నాగార్జున అడ్డ‌గా.. లోబోకు ఐదు మార్కులు ఇచ్చింది. ఆయ‌న ఇప్ప‌టికి అర్థం కాలేద‌ని, మన వైపు ఉన్నట్టు ఉంటాడు. కానీ ఎప్పుడూ వేరే వాళ్లుకు స‌పోర్టు చేస్తాడో అర్థం కాలేద‌ని చెప్పింది. ఏదో ఒక సైడ్ వంద శాతం ఉండండి, త‌న‌ గేమ్ త‌న‌ని ఆడుకోమ‌ని సలహా ఇచ్చింది. నెక్ట్స్ విశ్వకు ఐదు మార్కులు ఇచ్చింది. టాస్కుల్లో విశ్వ‌రూపం చూపిస్తాడ‌నీ, ఇక నుంచి ఇత‌రుల‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని కోరింది. ఇక‌ రవికి ఏడు మార్కులు ఇచ్చింది. ఇక నిన్ను సిల్లీ కారణాలతో నామినేట్ చేసేవారు ఉండరంటూ పంచ్ వేసింది.

ఆ త‌రువాత‌.. సిరి, షన్నులకు ఎనిమిదన్నర , జేస్సీకి ఎనిమిది మార్కులు ఇచ్చింది. మీ ముగ్గురు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాల‌ని.. ఏ సమస్య వచ్చినా బ్రహ్మ( ష‌న్ను) సార్ట్ అవుట్ చేస్తాడని ప్రియ చెప్పంది. ఈ క్ర‌మంలో దీప్తిని గుర్తుచేసింది. ఆమెకు ఏమైనా చెప్పాలా? అని ప్రియ అనడంతో.. ఏం వద్దు.. తనకు అన్ని అర్థం అవుతున్నాయని దండం పెట్టేశాడు ష‌న్ను. నాకు మాత్రం నువ్వు ఎక్క‌డ దీప్తిని మిస్ అవుతున్నట్టు అనిపించలేదే అని నాగ్ ఓ పుల్లా వేసే ప్రయత్నించగా.. షన్ను దండంపెట్టేశాడు. ఇంట్లో వాళ్ల‌కు కూడా భయపడ‌ను కానీ, దీప్తికీ భయపడతానని కుండ బద్ద‌లు కొట్టేశాడు షన్ను. ఇక‌ సిరి చాలా మంచిది. చాలా యాక్టివ్‌.. అని కామెంట్ చేసింది.

నెక్ట్ సింగర్ శ్రీరామ్ కు ఎనిమిది మార్కులు ఇచ్చింది. త‌నతో ఎక్కువ ఉండ‌లేదు.. కానీ, అత‌డు ఎక్క‌డ ఉంటే అక్క‌డ హ‌మ్ చేస్తే ఉంటాడ‌ని.. త‌న చూట్టు ఉంటే వాళ్లు హ్యాపీగా ఉంచుతాడ‌నీ, తాను బ‌య‌ట‌కు వ‌చ్చాక పాట నేర్పిస్తానని మాట ఇచ్చాడ‌నీ అని ప్రియ చెప్పగానే.. ప్రియ కోసం ఓ పాట పాడమని నాగార్జున అడిగాడు. దీంతో .. ఎందుకంటే ప్రేమంటే సినిమాలోని ఎమోషనల్ సాంగ్ పాడి అంద‌ర్నీ ఎమోష‌నల్ గా ట‌చ్ చేశాడు.

ఆ త‌రువాత‌ ప్రియాంక, ఆనీ మాస్ట‌ర్ల‌కు పది ప‌ది మార్కులకు ఇచ్చింది. పొద్దున లేవగానే పింకీ మొహమే చూస్తాననీ.. ఆమె మొహం చూడని రోజు నాకు ఏదో ఒకటి జరుగుతుందని.. వాళ్ల జ‌ర్నీని త‌లుచుకుంటూ ఎమోష‌నల్ అయ్యింది. ఇక ఆనీ మాస్ట‌ర్ ఎన్నో చూసి వచ్చింది. కానీ అందరినీ గుడ్డిగా నమ్మేస్తుంది. ఆమె కోపం కేవ‌లం ప‌ది నిమిషాలు ఉంటుంద‌నీ, ఆ త‌రువాత‌ సైలెంట్ అవుతుంది. అలానే ఉంటూ.. అలానే గేమ్ ఆడండి అని సలహా ఇచ్చింది ప్రియ‌. కాజల్‌కు ఏడు మార్కులు ఇచ్చింది. చాలా జాగ్రత్తగా ఆడు అని సలహా ఇచ్చింది.

మానస్ బంగారు కొండ. అత‌నితో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా వివరించి అందరికీ చెబుతాడు. అపార్థాలు లేకుండా చూస్తాడని ప‌ది మార్కులు ఇచ్చింది.. ఇక లాస్ట్ కి సన్నీకి 9 మార్కులు ఇచ్చి..ఆటలో ఎన్నో అనుకున్నాం అవన్నీ అక్కడికే వదిలేయాలనీ.. నా ప్లేట్లో తినే హక్కు, నా కాఫీ కప్పులో కాఫీ తాగే హక్కు ఒక్క సన్నీకి మాత్రమే ఉంటుందని స‌ర్‌ప్రైజ్ అనౌన్స్ మెంట్ చేసింది. ఈ వారం ఇంకా దగ్గర అవుదామని అనుకున్నాను కానీ అంతలోపే ఎలిమినేట్ అయ్యాన‌ని ఎమోషనల్ అయింది ప్రియ‌. అంద‌రీకి గుడ్ బై చేప్పి వెళ్లిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version