ఇది నిజమే.. మరోసారి ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్‌..

-

అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా బిల్ గేట్స్ ఒక మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు చాలానే వార్తా పత్రికల్లో కథనాలు మనం చూస్తున్నా.. వీరి ప్రేమ వ్యవహారంపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే.. ఇప్పుడు ఆమె ఎవరనే వివరాలు బయటకు వచ్చాయి. ‘మిస్టరీ వుమెన్’​గా పిలుస్తున్న ఆమెను.. మాజీ ఒరాకిల్ సీఈఓ భార్య పాలా హర్డ్ అన్న సంగతి బయటపడింది.రెండేళ్ల క్రితం 2021లో భార్య మెలిందాతో 27 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు బిల్​గేట్స్.

వారు మే 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెలలొ వీరి విడాకుల ప్రక్రియ పూర్తయింది. మెలిందా గేట్స్ మాజీ రిపోర్టర్ జాన్​ డూ ప్రీతో రిలేషన్​లో ఉన్నారనే వార్త బాగా వైరల్ అయింది. అయితే ,ఇప్పుడు బిల్​గేట్స్​తో డేటింగ్​లో ఉన్న పాలా హర్డ్ ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. మార్క్ హర్డ్ 2019 క్యాన్సర్​తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి పాలా హర్డ్ ఒంటరిగానే ఉంటున్నారు. గత ఏడాది నుంచి డేటింగ్​లో ఉన్న బిల్​గేట్స్, హర్డ్ తమ ప్రేమ గురించి గోప్యంగా ఉంచారు. బిల్​గేట్స్(67), పాలా హర్డ్(60) ఇద్దరూ టెన్నిస్ లవర్స్. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ ఫైనల్ టోర్నమెంట్​లో
ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్​ను వీక్షిస్తుండగా కెమెరాకు చిక్కారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version