తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో రోజురోజుకూ కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ తీవ్రతరమవుతున్నది. గేమ్ లో గెలిచేందుకు వారు ఇంకా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్కులను పూర్తి చేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సీజన్ ఫోర్ నాటి ‘రోబో ఫ్యాక్టరీ టాస్క్’ హౌస్ మెంబర్స్ కు ‘బిగ్ బాస్’ ఇచ్చారు. ఈ టాస్కు కంప్లీట్ చేసి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచేందుకు కంటెస్టెంట్స్ తమ సర్వశక్తులను ఒడ్డుతున్నారు.
ఇప్పటి వరకు ‘బిగ్ బాస్’ ఓటీటీ షోలో గేమ్ చాలా బాగా ఆడుతున్న బిందు మాధవి.. ఈ టాస్కులో మాత్రం కొంచెం వెనక బడింది. అషురెడ్డి, అరియానా, బిందు మాధవి..రోబోస్ కంపెనీగా మారారు. మిగతా వారు సప్లైయర్స్ అయ్యారు. కంపెనీలో ఎక్కువ రోబోలు అసెంబుల్ చేసిన వారు, ఎక్కువ బిట్ కాయిన్స్ సంపాదించిన సప్లైయర్స్ కెప్టెన్సీ పోటీదారులుగా ఉంటారని ‘బిగ్ బాస్’ స్పష్టం చేశారు. దాంతో కంటెస్టెంట్స్ డీల్స్ కుదుర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.
శివ కాయిన్స్ గెలిచేందుకు రకరకాల ప్లాన్స్ వేసుకుని సక్సెస్ అయ్యాడు. అయితే,ఈ టాస్క్ లో అందరి కంటే స్టార్ట్ గేమ్ హమీద ఆడింది. సార్ట్ గా ఒకరి తర్వాత మరొకరితో డీల్స్ కుదర్చుకుని కెప్టెన్సీ పోటీదారుగా నిలిచేందుకు హమీద ఎత్తుగడలు వేసింది. అందులో కొంత మేరకు అప్పుడే సక్సెస్ అయింది కూడా.
ఈ క్రమంలోనే ఆమె తన కోసం నిలబడిన బిందు మాధవిని అలాగే వదిలేసింది. అలా బిందు మాధవి టాస్కు పరంగా ఓడిపోతున్నప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో తన మంచితనంతో స్థానం పదిలం చేసుకుంటున్నదని బీబీ లవర్స్ అంటున్నారు. ఇదంతా కూడా ఓటింగ్ సమయంలో బిందు మాధవికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.