Breaking News : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. విద్యాసంస్థల్లో బయోమెట్రిక్‌ హాజరు

-

రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ ను అమలు చేయాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ నుండి యూనివర్సిటీల వరకు అన్ని విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్లు, సిబ్బందికి బ‌యో మెట్రిక్ హాజ‌రును త‌ప్పనిస‌రి చేసింది విద్యాశాఖ. ఈ మేరకు విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ అదేశాలు జారీ చేశారు. ఇందకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని కోరారు విద్యాశాఖ. ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కాలేజీలు, వర్సిటీ లలో ఆధార్ సహిత బయో మెట్రిక్ అటెండెన్స్ తప్పని సరి చేసింది విద్యాశాఖ.

విద్యార్థులకు, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి బయో మెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది విద్యాశాఖ. స్కాల‌ర్‌షిప్‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ను విడుద‌ల చేసేందుకు హాజ‌రు శాతాన్ని తెలుసుకునేందుకు బ‌యోమెట్రిక్ ఉపయోగపడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది విద్యాశాఖ. అక్టోబర్ 1 నుండి అమలు చేయాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది విద్యా శాఖ. ఈ మేరకు కళాశాల విద్యా శాఖ కమిషనర్ అమలుకు అనుమతి కోరారు. అనుమతి నిస్తూ…. బయో మెట్రిక్ హాజరును అమలు చేయాలని ఉన్నత విద్యా శాఖ పరిధిలోని విభాగాలను ఆహుదేశించింది విద్యా శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version