మాల్దీవ్స్ ట్రిప్: ఎండల్లో మగ్గిపోతున్న భర్త.. ఫన్నీ వీడియోని షేర్ చేసిన బిపాసా బసు.

-

సినీ తారలందరూ వెళ్ళే పర్యాటక ప్రాంతం ఏదీ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క ప్రదేశం మాల్దీవ్స్. వరుసపెట్టి సినిమా తారలంతా అక్కడికి క్యూ కడుతుంటారు. కరోనా మహమ్మారి ఉండగా కూడా మాల్దీవులకి గిరాకీ పెరిగిందంటే దానికి కారణం సినిమా వాళ్ళే. సముద్ర తీరాల్లో బికినీ వేసుకుని అందమైన ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే ఎవరికీ మాత్రం అక్కడికి వెళ్ళాలని అనిపించదు చెప్పండి. తాజాగా బాలీవుడ్ నటి బిపాసా బసు మాల్దీవులకి వెళ్ళింది.

తన భర్తతో కలిసి సముద్ర తీరాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఐతే అందులో భాగంగా అందమైన ఫోటోషూట్లు, సెల్ఫీలు ఉండడం మామూలే. ఇక వీడియోల గూర్చి చెప్పాల్సిన పనిలేదు. బిపాసా బసు తన భర్త ఫన్నీ వీడియోని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకుంది. ఎండలో నిలబడ్డ బిపాసా భర్త కరణ్ సింగ్ గ్రోవర్, తన కండల వంక చూసుకుని, ఎంద వేడిమి ఎక్కువగా ఉందంటూ కండలకి గాలి ఊదుతూ ఆ వేడి నుండి చల్లబడే ప్రయత్నం చేసాడు. ఈ వీడియోని బిపాసా బసు షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version