నిమ్మకాయల చిన్నరాజప్పకి వైసీపీ షాక్

-

ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్ డ్రా వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా తూర్పూ గోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప కి వైసీపీ షాక్ ఇచ్చింది. పెద్దాపురం మున్సిపాలిటీ 10వ వార్డు టీడీపీ అభ్యర్థి కొంగర మంగరాజు, వైసీపీలో చేరారు.

అయితే ఇక్కడ టీడీపీకి షాక్ ఇచ్చే మరో అంశం ఏంటంటే, టీడీపీ నుంచి డమ్మి అభ్యర్దులుగా మంగరాజు కుటుంబమే నామినేషన్లు వేసింది. ఇక ప్రస్తుతం మంగరాజు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. మరొ  ఇద్దరు టీడీపీ అభ్యర్దులు కూడ వైసీపీకి టచ్ లో ఆ ఏరియాలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నేతలు జనసేన అభ్యర్దులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేపటి వరకు విత్ డ్రాలకు అవకాశం ఉండటంతో ఏం జరుగుతుంది అనే టెన్షన్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version