గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పటి దాకా ఎంఐఎం పార్టీ రెండవ స్థానంలో ఉండగా ఎంఐఎం పార్టీ సాధించిన సీట్లను మించి బీజేపీ పార్టీ సీట్లు తెచ్చుకోవడంతో రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అధికార టీఆర్ఎస్ పార్టీకి 55 స్థానాలు రాగా బిజెపి 46 స్థానాలు కైవసం చేసుకుంది.

ఇక మరోపక్క మజ్లీస్ పార్టీ 42 స్థానాలకు పరిమితమైంది. అయితే కాంగ్రెస్ మరీ దారుణంగా రెండు స్థానాలకు పడిపోవటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మరో ఐదు స్థానాలు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఐదు స్థానాలు ఎవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. 2016 తో పోలిస్తే బీజేపీ బలం భారీగా పెరిగితే అదే సమయంలో టిఆర్ఎస్ బలం భారీగా తగ్గింది. టిఆర్ఎస్ ఓటు బ్యాంకు బిజెపికి షిఫ్ట్ అయినట్లు భావించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version