ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ పై అవినీతికి పాల్పడ్డారని బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై డీఎంకే స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారం అని మీ దగ్గర దీనికి సంబంధించి అధరాలు ఉంటే చూపించాలని కామెంట్ చేశారు. అంతే కాకుండా బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కు డీఎంకే పార్టీ నోటీసులు సైతం పంపింది. ఈ నోటీసు ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గానూ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై బహిరంగంగా సీఎం స్టాలిన్ కు క్షమాపణలు చెప్పడంతో పాటుగా రూ. 500 కోట్లు పరువునష్టం గా ఇవ్వాలని పేర్కొంది.
బీజేపీ చీఫ్: స్టాలిన్ అవినీతి చేశాడు.. ఇప్పటికే నేను నా మాటపైనే ఉన్నా !
-