బడుగుల ఆత్మగౌరవ పోరు.. బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు

-

హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ధర్నా చేపట్టింది. ‘బడుగుల అత్మగౌరవ పోరు’ పేరుతో ఈ ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు డీకే అరుణ, లక్ష్మణ్, సోయం బాపూరావు, స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును తీసుకొచ్చారని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.

 

అసైన్డ్ భూములను రద్దు చేసిన కేసీఆర్‌ను ఉరి తీయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మోసగాడని, దళితులు ఆయనను నమ్ముద్దని పిలుపు నిచ్చారు. ఏడేళ్ల ముందే మూడు ఎకరాల భూమి ఇస్తే ఇప్పుడు దళితులు లక్షాధికారులు అయ్యేవారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version