ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ బెడిసి కొట్టడం వలన నిధుల కోసం బిజెపి ప్లాన్ బి అమలు చేస్తోందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. బిజెపి కి డైరెక్ట్ గా విరాళాలు ఇస్తున్న వ్యక్తులని పార్టీలో చేర్చుకుంటుందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలని చెప్పారు. బిజెపిలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డిని ప్రస్తావిస్తూ విమర్శలు సిబిఐ కేసులను ఎదుర్కొంటున్న జనార్ధన్ రెడ్డిని బిజెపిలో ఎందుకు తీసుకున్నారని అన్నారు.
దీని మీద సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు బిజెపి లోకే చేరారు కనుక అతనికి సిబిఐ త్వరలో క్లీన్ చీట్ ఇస్తుందని అన్నారు. అవినీతి ఆరోపణలని ఎదుర్కొంటున్న వ్యక్తులు బిజెపి మోడీ తో కలిసి వస్తే నిర్దోషులవుతారని చెప్పారు. ఎలక్ట్రోరల్ బాండ్ స్కీముని సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో ప్లాన్ బి ని అమలు చేస్తారని అన్నారు.