సొంతూరు హిమ్మత్ నగర్ లో గెల్లు శ్రీనివాస్ కు ఎదురుగాలి..ఈటలకు భారీ ఆధిక్యం !

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సొంతూరు హిమ్మత్‌ నగర్‌ లో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు ఓటర్లు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి…. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామ మైన హిమ్మత్ నగర్ లో ఈట‌ల‌ రాజేందర్ కు 191 ఓట్ల మెజారిటీ వచ్చింది.

గెల్లు శ్రీనివాసు స్వంత గ్రామంలో బిజెపి పార్టీ 549 ఓట్లు పోల్‌ కాగా… టీఆర్‌ఎస్‌ పార్టీ కి 358 ఓట్లు వచ్చాయి. హిమ్మత్ నగర్ లో ఉన్నటు వంటి యువత ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపి నట్లు సమాచారం అందుతోంది. కాగా… ఎనిమిది రౌండ్‌ లో బీజేపీ పార్టీ కి 4086 పోల్‌ కాగా… అధి కార టీఆర్‌ఎస్‌ పార్టీకి 4248 ఓట్లు పోల్‌ అయ్యాయి. అయితే.. ఎనిమిదో రౌండ్‌ లో 162 ఓట్ల ఆధిక్యాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించినప్పటికీ… ఓవరాల్‌ గా చూస్తే… 3270 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version