కాసేపటి క్రితం నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశమలో ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు అంటూ మాట్లాడారు. ఇంకా కాంగ్రెస్ తో BRS కలిసిపోయింది అని క్లియర్ గా అర్థమవుతోందన్నారు. అంబేద్కర్ కు వందల అడుగుల విగ్రహాలు పెట్టడం ముఖ్యం కాదు… ఆయన భావాలను అర్ధం చేసుకుని సరైన దారిలో పెడితేనే మంచిదన్నారు. అస్సలు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం ఎందుకు చేశారో సమాధానము చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలను మరియు సంక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. బీజేపీ ఒక దళితుడిని మరియు ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన గొప్పతనం అంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కేసీఆర్ దళితులకు ఏమి చేశారో చెప్పాలి అని ఛాలెంజ్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పాశ్వాన్ !
-