దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు : ఎంపీ లక్ష్మణ్

-

బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎవరు అనే దాని పై ఇంకా చర్చే లేదు. ఇప్పటికీ 11 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నిక పూర్తి అయింది, ఇంకా 16 రాష్ట్రాలకు ఏలిజిబిలిటి వచ్చింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఒక వారం లో తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక పూర్తి కావొచ్చు. దక్షిణాది నుండి ఇప్పటికే రెండు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షులు అయ్యారు. డీపీఆర్, సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనకకు వెళ్తుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా.. బీసీల్లో పది శాతం ముస్లింలను కలుపకుండా అసెంబ్లీ లో బిల్లు పెట్టాలి. కుల గణన తప్పుల తడకగా ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తరువాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాబా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందు పరిచారు… కానీ పెరగక పోవచ్చు అని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news