బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : పొంగులేటి

-

సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనను రాక్షస పాలన అని చెప్పిన కమ్యూనిస్టులు ఇప్పుడు ఎలా ఆ పార్టీతో జత కట్టారని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని విమర్శించారు. బీజేపీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని పొంగులేటి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‭లో టీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పారు. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలైన సీఐడీ, ఈడీ పై కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని పొంగులేటి విమర్శించారు.

జీ20 సదస్సులో మోడీని ప్రపంచదేశాలు పొగుడుతుంటే.. ఇక్కడి కుటుంబ పార్టీలు మాత్రం విషం కక్కుతున్నాయని పొంగులేటి మండిపడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక భారతదేశ గౌరవ ప్రతిష్టను ప్రపంచదేశాలకు తెలిసేలా చేశారని పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. జి20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అన్ని దేశాలు కొనియాడాయన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారతదేశ గౌరవ ప్రతిష్టను ప్రపంచ దేశాలకి తెలిసేలా చేశారు అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version