కోటి మంది మహిళలను కోటిశ్వర్లను చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. 15 నెలల్లో ఎంత మందిని కోటీశ్వర్లన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని మహిళలు భావిస్తున్నారు, మహిళలకు 2500 హామీ కూడా నెరవేర్చలేదు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది బీజేపీ. మహిళలను కేంద్ర రక్షణ, అర్ధిక మంత్రులను చేసింది బీజేపీ.
కాంగ్రెస్ పార్టీకి మహిళలు అంటే ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని అన్నగా భావిస్తే కడుపుకోతే మిగులుతుంది. రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి బానిసగా మారారు. తులం బంగారం ఇస్తామని చెప్పి.. బెల్టు షాపులు తెరిచారు. బెల్టు షాపుల పేరుతో అనేక మంది తాలి బొట్లు తెంపుతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామన్న ముఖ్యమంత్రి ఒక్క మహిళనైనా పారిశ్రామిక వేత్తను చేశారా.. 600 బస్సులు ఇస్తామని చెప్పి కేవలం 20బస్సులే ఇచ్చారు అని పేర్కొన్నారు శిల్పా రెడ్డి.