కెసిఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది – ఈటెల రాజేందర్

-

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో పల్లె గోస – బీజేపీ భరోసా రెండవ రోజు 15 కిలోమీటర్ల బైక్ ర్యాలీలో పాల్గొన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిడి వల్లనే రాష్ట్రంలో మరో 10 లక్షల పెంచన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. కెసిఆర్ ఎవరినీ కలవడు.. అలాంటి సీఎం మనకు కావాలా? అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందన్నారు ఈటెల.

సీఎం కేసీఆర్ మూడున్నర సంవత్సరాలుగా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రెండవ సారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ అరచేతిలో బెల్లం పెట్టీ మోచేతి నాకించారని అన్నారు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అన్నారు? ఇవ్వలేదు. మూడేళ్లుగా 65 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ప్రమాదవశాత్తు గాయపడ్డ వారికి వికలాంగ పెన్షన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. విధివంచించిన వితంతువులకు పెన్షన్ లేదన్నారు. బీజేపీ బైక్ ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టిన తరువాత ఇక ప్రజా క్షేత్రంలో తప్పించుకోలేక ఆగస్ట్ 15 కి 10 లక్షల పెన్షన్ ఇస్తా అని ప్రకటించారని అన్నారు ఈటెల.

నెల నెలా పెన్షన్ ఇవ్వడం లేదని.. 3 నెలలు ఆలస్యంగా వస్తుందని..1 వ తేదీన వేయాలి అని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇస్తా అని పేదల కళ్ళలో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెల్లు దాటవని ఎద్దేవా చేశారు. మీరు ఆశీర్వదిస్తే రాబోయేది బీజేపీ ప్రభుత్వమే.. మన ప్రభుత్వంలో అన్నీ సమస్యలు పరిష్కారం చేసుకుందామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version