అప్పుడు బాబ్రీ… ఇప్పుడు జ్ఞానవాపి వంతు: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

-

ప్రస్తుతం దేశంలో జ్ఞానవాపి మసీదు గురించి చర్చ జరుగుతోంది. హిందూ దేవాలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని చాలా మంది భావిస్తుంటారు. కాశీలో ఈ మసీదు వెనకాల ఇంకా దేవాలయానికి సంబంధించి నిర్మాణం ఉంది. దీంతో హిందువులు చాలా మంది జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతాన్ని హిందువులకు అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జ్ఞానవాపి మసీదుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

1992లో బాబ్రీ మసీదు… ఇది 2022 ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వంతు వచ్చిందని.. మసీదును కూల్చివేసి ఆలయాన్ని స్వాధీనం చేసుకునే సమయం వచ్చిదంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ వ్యాఖ్యానించారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు యువత రెట్టింపు అయిందని… మరో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని” ఆయన అన్నారు. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా సోమ్ మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన 1992ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ స్పందిస్తూ.. ‘సమాజంలో అశాంతి, చీలికలు సృష్టించేందుకు బీజేపీ వేస్తున్న గేమ్‌ప్లాన్ చేస్తుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version