ఈ బీజేపీ ఎమ్మెల్యే నోటి &$@ చూశారా?

-

సమయం సందర్భంగా లేకుండా, అవసరం లేని మాటలు మాట్లాడుతూ… అదేదో గొప్ప విషయం అన్నట్లు, ఒక వర్గానికి తామేదో నాయకులమన్నట్లు ఫీలవుతుంటారు కొందరు నాయకులు. ఈ విషయంలో ఒక వర్గాన్ని వ్యతిరేకించడంలో తమదే పై చేయి అని ఫీలయిపోతుంటారు.. మరో వర్గానికి మేమే సామంతులం అన్నట్లు సంకేతాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక బీజేపీ ఎమ్మెల్యే తన నోటి దురుసును ప్రదర్శించుకుంటూ.. తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు!

ఉత్తరప్రదేశ్లోని డియోరియ జిల్లా బర్హాజ్ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ గతంలో ఎన్నో సార్లు తీవ్ర దుమారం రేపేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అలవాటైనపోయిన ప్రాణం… తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూడా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వీడియోను విడుదల చేశారు. ఈ మేరకు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందన్న విషయం కాసేపు పక్కన పెడుతూ… ఇంతకూ ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే… ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వినండి ఎవరూ కూడా ఓ మతానికి చెందిన దుకాణంలో కూరగాయాలు కొనొద్దు.. ఎందుకంటే వారినుంచే ఈ వైరస్ వ్యాపిస్తోంది అని! ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొందరు చేసిన తప్పును ఒక మతాన్ని నిందించడం సరికాదు అని ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపిన కొద్దిరోజులకే ఈ బీజేపీ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం!

అతడు చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విపత్కర సమయంలో మానవత్వం ప్రదర్శించాల్సింది పోయి.. అలవాటైపోయిన మత రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నాయి. ఈ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి! ఇలాంటి పరిణామం ఇప్పుడే కాదు గతంలోనూ జరిగాయి. ఢిల్లీలో కూరగాయాలు విక్రయించే వ్యక్తిని “నీ పేరు ఏమిటీ” అని అడిగి మరి దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జంషెడ్ పూర్లో పండ్ల దుకాణంపై విశ్వహిందూ పరిషత్ ఓ పోస్టర్ వేసి విద్వేషాన్ని రగిల్చేలా చర్యకు పాల్పడ్డారు.

కాగా… కరోనా వైరస్ వ్యాప్తిని కొందరు ఇలా రాజకీయం చేసుకుంటూ… తుఫానులూ, వరదలు, కులాలు, మతాలు, ఆఖరికీ కరోనా అయినా సరే… రాజకీయానికి కాదేదీ అనర్హం అన్నస్థాయిలో రెచ్చిపోతున్నారు! ఈ దౌర్భాగ్యం మనదేశంలోనే ఉండటం మన దురదృష్టం!

Read more RELATED
Recommended to you

Exit mobile version